తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు రెడీ అయ్యారు. ఈనెల 22 నుంచి సమ్మె సైరన్ మోగించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ, ఆర్టీసీ యాజమాన్యం నుంచి గానీ ఎలాంటి రియాక్షన్ లేదని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. దీంతో సమ్మె బాట పట్టక తప్పలేదని వెల్లడించింది. 32 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో గత్యంతరం లేక సమ్మెకు దిగాల్సి వస్తుందని పేర్కొంది.