ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. వైరల్ ఫీవర్‍తో పాటుగా స్పాండిలైటిస్ సమస్యతో పవన్ ఇబ్బంది పడుతున్నట్లు డిప్యూటీ సీఎంవో కార్యాలయం ఇటీవల ప్రకటన విడుదల చేసింది. స్పాండిలైటిస్ సమస్య కారణంగానే మంగళవారం నాటి సీఎం చంద్రబాబు నాయుడు సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరుకాలేకపోయారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల్లోని ఆలయాల సందర్శన మొదలెట్టారు పవన్. దీంతో అనేక ప్రచారాలు తెరమీదకు రాగా.. పవన్ కళ్యాణ్ తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. నాలుగేళ్ల క్రిందటి మొక్కులు చెల్లించుకునేందుకు ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఆలయాల సందర్శనకు వచ్చినట్లు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.