ప్రస్తుతం మానవ సంబంధాలకు అర్థం లేకుండా పోయింది. అవి పూర్తిగా ఆర్థిక బంధాలుగా మారాయి. ఆస్తుల కోసం ఆప్తులను, తోబుట్టువులను దూరం చేసుకుంటున్నారు. తాజాగా 264 గజాల స్థలం కోసం ఓ కుటుంబం కోర్టుకెక్కింది. దీనిపై తెలంగాణ హైకోర్టు జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు బతికున్నంత వరకు ఆస్తిలో వాటా కోరకుండా చట్టం తేవాలని.. కోర్టుకు అధికారం ఉంటే తప్పకుండా చట్టం చేసేవాళ్లమని వ్యాఖ్యానించారు.