మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మానవత్వం మంటగలిసే ఘటన చోటు చేసుకుంది. ఓ కుమారుడు తండ్రికి అంత్యక్రియలు నిర్వహించకుండా దారుణంగా ప్రవర్తించాడు. ఆస్తి ఇస్తేనే తండ్రికి తలకొరివి పెడతానంటూ బంధువులతో గొడవకు దిగాడు. దీంతో చేసేదేం లేక చివరకు చిన్న కుమార్తెతో తల కొరివి పెట్టించి తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించారు. మాయమైపోతున్న మానవ సంబంధాలకు అద్దం పట్టే ఈ ఘటన స్థానికులచే కంటతడి పెట్టించింది.