రకరకాల అనారోగ్య సమస్యలతో వచ్చే రోగులకు వైద్యం అందించి.. పునర్జన్మ ప్రసాధించే పవిత్రమైన ఆస్పత్రిని.. కొందరు వైద్య సిబ్బంది ఏమాత్రం బాధ్యత లేకుండా.. జుగుప్సాకరమైన పనులు చేస్తూ పరువు దిగజార్చుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ (AIIMS) వైద్య కళాశాలలో రాసలీలల వ్యవహారం వెలుగు చూసింది. అదేదో సీక్రెట్‌గా జరుగుతుంటే బయటపడటం కాదు.. అందరికీ కనపడేలా సిగ్గువిడిచి చేస్తున్న సయ్యాటను బయటి నుంచి వీడియో తీయగా.. అది కాస్త వైరల్ అవుతోంది.