అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మోతుగూడెం జెన్‌కో ఆస్పత్రిలో ఓ పాము హల్‌చల్ చేసింది. ఓ అడుగుల కోబ్రా ఆస్పత్రిలోకి దూరి రోగులను, ఆస్పత్రి సిబ్బందిని బెంబేలెత్తించింది. దీంతో ఆసుపత్రిలోని రోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది.. పామును బంధించి అడవిలో వదిలిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు తమ ప్రాంతంలో పాములు ఎక్కువగా తిరుగుతున్నాయని.. స్నేక్ క్యాచర్‌ను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.