నాగర్ కర్నూల్ జిల్లాలో ఒక తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. తనను ఇంగ్లీష్ టీచర్ వేధిస్తోందని ఆరోపిస్తూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. మిగతా టీచర్లతో చనువుగా ఉండటం వల్ల టీచర్ తనపై పగ పెంచుకుందని, పనిష్మెంట్‌ల పేరుతో వేధిస్తోందని విద్యార్థిని వాపోయింది. టీచర్ వేధింపులు తట్టుకోలేక మనస్తాపంతో చేయి కోసుకుంది.