ఇంజెక్షన్లతో మేకలు, గొర్రెల రక్తం పిండేసే ముఠా.. హైదరాబాద్ అడ్డాగా దందా..!

2 months ago 8
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో మేకలు, గొర్రెల రక్తాన్ని అక్రమంగా పిండేస్తున్న దందా ఇటీవల వెలుగులోకి వచ్చింది. స్థానిక మటన్ షాపు యజమాని, నకిలీ వెటర్నరీ డాక్టర్ కలిసి మేకలు, గొర్రెల నుంచి రక్తం సేకరిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోీసులు వారి నుంచి సమాచారం రాబట్టారు. దీంతో ఆ రక్తం కాచిగూడలోని ఓ ల్యాబ్‌లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. అనంతరం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు, ఈస్ట్ జోన్ పోలీసులు, క్లూస్ టీమ్ సంయుక్తంగా దాడులు నిర్వహించి.. ల్యాబ్‌​లో సిబ్బందిని ప్రశ్నించారు. మేకలు, గొర్రెల రక్తం నిల్వలు, కొనుగోలు పత్రాలు, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article