ఏపీలోని ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 1355 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా జేఈఈ, నీట్ కోచింగ్ అందించనుంది. మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు, సాంఘిక ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ సబ్జెక్టులపై ప్రత్యేక మెటీరియల్ అందిస్తారు.