ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. శనివారం అన్నమయ్య జిల్లా సంబేపల్లెలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. యువరాజు యాదవ్ టెకీ మాట్లాడుతూ.. తాను బెంగళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగినని, ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నానని తెలిపాడు. అంతేకాదు, తనకు కటింగులన్నీ పోనూ నెలకు 6.37 లక్షలు చేతికొస్తోందని చెప్పగా... ఎంత జీతం అంటూ మరోసారి చంద్రబాబు అడిగారు. దీంతో యువరాజు.. ఏడాదికి రూ.93 లక్షల ప్యాకేజీ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో అందరూ చప్పట్లు కొట్టి యువరాజును అభినందించాలంటూ సభకు హాజరైన సభికులను సీఎం కోరారు. దీంతో ప్రజావేదిక కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. కాగా, యువరాజు జీతంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీనిపై స్పందించిన అతడు.. ఆధారాలతో సహా వివరణ ఇచ్చారు