కరీంనగర్ నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల్లోని ఇళ్లకు ప్రత్యేకంగా కొలతలు నిర్వహిస్తున్నారు అధికారులు. భువన్ యాప్ ద్వారా ఇళ్ల వివరాలను సరిజేస్తూ.. కొత్త పన్నుకు నోటీసులు పంపిస్తుంది. అక్రమ కట్టడాలపై సర్వే చేసి, నోటీసులు జారీ చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి పెంచిన ఆస్తిపన్ను రాబట్టుకోవాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా వచ్చిన వార్డు అధికారులకు డివిజన్లు, వార్డులు అప్పగించారు. తక్కువ ఆస్తి పన్ను కడుతున్న వారి జాబితా తీసుకొని మళ్లీ కొలుస్తున్నారు.