తెల్ల రేషన్‌కార్డు ఉన్న మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా బ్యూటీషియన్ కోర్సు, మగ్గం, జర్దోసి నేర్చుకునే అద్భుత అవకాశం మీ ముందు ఉంది. తెల్ల రేషన్‌కార్డు ఉన్న మహిళళకు రూడ్ సెట్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ సదవకాశాన్ని కల్పిస్తోంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే ఉచితంగా మగ్గం, బ్యూటీషియన్ కోర్సులు నేర్పిస్తామని చెప్తోంది. అయితే ఈ అవకాశాన్ని మాత్రం కేవలం అనంతపురం జిల్లాలోని గ్రామీణ మహిళలకు మాత్రమే కల్పించింది. నవంబర్ 15 నుంచి 30 రోజుల పాటు ఉచిత ట్రైనింగ్ అవకాశం ఉందని.. ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని రూడ్ సెట్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.