నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేదు. పునాది వరకు సొంతంగా నిర్మించుకుంటే ప్రభుత్వం రూ.లక్ష ఇస్తుంది. అయితే.. డబ్బుల్లేని లబ్ధిదారులకు స్వశక్తి సంఘాల ద్వారా రుణాలు ఇప్పించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇంటి నిర్మాణం ప్రారంభించడానికి అవసరమైన పునాది వ్యయం కోసం స్వశక్తి సంఘాల నుండి అర్హులైన లబ్ధిదారులకు రూ. లక్ష వరకు రుణం ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది.