తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ ప్రారంభమైంది. పథకం యొక్క మొదటి దశలో భాగంగా, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఒక్కొక్క లబ్ధిదారునికి మొదటి విడతగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు.