తెలంగాణలోని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నిర్మాణ వ్యయం భారాన్ని తగ్గించేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులకు 8 ట్రాక్టర్ల ఉచిత ఇసుకను అందించనుంది. గ్రామ కార్యదర్శి ఆమోద పత్రంతో ఎమ్మార్వో కార్యాలయం నుంచి టోకెన్లు పొంది, సమీప ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను పొందవచ్చు.