తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. అయితే.. ఈ పథకంలో భాగంగా.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అర్హుల జాబితాలు ప్రకటిస్తున్న ప్రభుత్వం.. నిరుపేదల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూనే ఉంది. కాగా.. దరఖాస్తులు చేసుకున్న చాలా మందికి వారి దరఖాస్తు ఏ దశలో ఉంది.. సర్వే చేశారా లేదా.. ఇల్లు మంజూరైందా.. ఏ లిస్టులో వచ్చిందన్న అన్ని వివరాలను ఈజీగా.. సింగిల్ క్లిక్‌తో తెలుసుకునే ఛాన్స్ కల్పించింది ప్రభుత్వం.