తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు 'ఇందిరమ్మ ఇళ్ల' పథకాన్ని వేగవంతం చేసింది. రాబోయే రెండేళ్లలో 9 లక్షల ఇళ్లను అర్హులైన ఎల్-1 జాబితాలోని లబ్ధిదారులకు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి ప్రాధాన్యత ఇస్తూ, మిగిలిన వారికి తర్వాతి దశల్లో అవకాశం కల్పించనుంది. అయితే ఎల్-3 జాబితాలోని దాదాపు 32.98 లక్షల ఇండ్లను రద్దు చేసేందుకు యోచిస్తోంది.