హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణ గడువును తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 వరకు పొడిగించింది. వరుస సెలవుల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మరో ఐదు రోజులు అవకాశం ఇచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం వరకు 46,121 దరఖాస్తులు రాగా.. అర్హత ప్రమాణాల ఆధారంగా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి, ఆగస్టు నెలాఖరులోగా ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.