తెలంగాణలో బతుకమ్మ పండగ సందర్భంగా రేవంత్ సర్కార్ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తుందని చాాలా మంది ఆశపడ్డారు. అయితే అందరికి చీరలు పంపిణీ చేయలేదు. అలానే రెండు చీరలు ఇస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. కానీ చివరకు చాలా ప్రాంతాల్లో కేవలం ఒక్క చీరనే పంపిణీ చేశారు. ఈ క్రమంలో ఇందిరమ్మ చీరల పంపకంపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెలలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉండనుంది అని తెలిపారు.