ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్ల పంపిణీపై లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక విషయం వెల్లడించింది. సోమవారం నుంచి ఎంపికైన వారికి అలాట్‌మెంట్ లెటర్లను వారి వాట్సాప్, ఎస్సెమ్మెస్ ద్వారా పంపించనున్నట్లు తెలిపింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్ నుంచి కూడా ఈ అలాట్‌మెంట్ పత్రాలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. మరోవైపు.. రాయదుర్గం మల్కం చెరువు వెనుక 2.85 ఎకరాల ప్రభుత్వ భూమిలో 480 ఫ్లాట్లతో నిర్మించనున్న ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.