కరీంనగర్ జిల్లాలో.. ఒకే రోజు 2 ఏటీఎంలలో దొంగతనం

2 hours ago 4
కరీంనగర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజు వ్యవధిలో రెండు చోట్ల ఏటీఎంలనే టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి మరీ 8 లక్షల నగదుతో పారిపోయారు. కరీంనగర్ జిల్లాలోని దుర్షేడు, తిమ్మాపూర్ ఎస్బీఐ ఏటీఎంలలో తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఇద్దరు దుండగులు ప్రవేశించారు. ఆధారాలు దొరక్కుండా తెలివిగా సీసీ కెమెరాలపై స్ప్రే చల్లిన దొంగలు.. దుర్షేడు ఎస్బీఐ ఏటీఎంలోని రూ.8 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. అయితే దొంగతనం జరుగుతున్న సమయంలో ఢిల్లీలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో ఉన్న సెంట్రల్ సెక్యూరిటీ అలారం మోగడంతో అక్కడి అధికారులు వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. ఢిల్లీ నుంచి సమాచారం అందుకున్న కరీంనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఇద్దరు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే రోజు రెండు చోట్ల చోరీకి పాల్పడింది ఒకే ముఠానా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
Read Entire Article