కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోని కలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భూ భారతి చట్టం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, తాగునీటి సమస్యలపై కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రోజువారి పనితీరు నివేదికలను సీఎంఓకు పంపాలని, ప్రతిరోజు రెండు మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు.