తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త శ్రీనివాసులు హత్య కలకలం రేపింది. ఈ కేసులో జనసేన నియోజకవర్గ ఇన్ ఛార్జి వినుత కోట, ఆమె భర్త చంద్రబాబు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రాయుడు గతంలో వినుత వద్ద డ్రైవర్‌గా పనిచేయగా, హత్యకు బొజ్జల సుధీర్ రెడ్డి కారణమని చంద్రబాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వినుత కోటను జనసేన పార్టీ నుంచి బహిష్కరించినట్లు పార్టీ కన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చీఫ్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు.