ఒక పెంపుడు పిల్లి కోసం రెండు కుటుంబాలు నెల రోజులుగా కొట్టుకుంటున్నాయి. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు కూడా చేసుకున్నాయి. పోలీసులు గీ పిల్లి లొల్లేంటయ్యా అని తీసిపారేయటంతో.. ఏకంగా జిల్లా ఎస్పీ దగ్గరికి పంచాయితీ చేరింది. ఇంకేముంది జిల్లా పోలీస్ బాస్ ఆదేశించటంతో.. పోలీసులు పిల్లి పంచాయితీ తెంపేందుకు నానా తంటాలు పడుతున్నాయి. అయినా పంచాయితీ తెగకపోవటంతో.. సాంకేతికంగా చివరి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడైనా తేలుతుందో లేదో చూడాలి.