ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో ఈకలు లేని కోడిపుంజు చూసేవారిని ఆకట్టుకుంటోంది. దేవినేనివారిగూడెంలో ఇస్మాయిల్ అనే వ్యక్తి వద్ద ఈ కోడి ఉంది. సాధారణంగా కోడిపుంజు అంటే ఒంటినిండా రంగురంగుల ఈకలు ఉంటాయి. కానీ ఈ కోడికి పుట్టినప్పటి నుంచి ఈకలు లేవని ఓనర్ ఇస్మాయిల్ చెప్తున్నారు. గ్రామస్థులు కూడా ఈకలు లేని కోడిపుంజును ఆసక్తిగా తిలకిస్తున్నారు. మరోవైపు జన్యుపరమైన లోపం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయని పశువైద్య శాఖ అధికారులు చెప్తున్నారు.