వివిధ కారణాలతో వాయిదాపడిన మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. రెండు నెలల నుంచి ఉత్కంఠ రేపుతున్న ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించేలా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంది. ఫిబ్రవరి 11న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగ్గా.. 13 న ఫలితాలు వచ్చాయి. అదే నెల 16న మున్సిపల్ ఛైర్మన్లు, వైస్- ఛైర్మన్ల ఎన్నికను నిర్వహించగా.. కొన్నిచోట్ల వాయిదా పడిన విషయం తెలిసిందే.