తెలంగాణకు చెందిన 2 వేల మంది విద్యార్థులు ఇరాన్‌లో యుద్ధ భయాల మధ్య బిక్కుబిక్కుమంటూ బతుకుతుండటం.. ఇక్కడ ఉన్న వారి తల్లిదండ్రులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. మిసైళ్లు, బాంబుల వర్షం కురుస్తుండటంతో ఇరాన్‌లో తమ వారు ఎలా ఉన్నారోననే ఆందోళన వారిలో తీవ్రమవుతోంది. ఈ క్రమంలోనే స్పందించిన తెలంగాణ సీఎం.. తెలుగు వారంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.