హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. చిక్కడపల్లిలో నలుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, అందులో ఒక మహిళా ఉద్యోగి డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి లక్షల విలువైన MDMA, LSD, కుష్ వంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వీరు వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో పోలీసులు ఆరా తీస్తున్నారు.