కుమురంభీం జిల్లా ఇప్పల్ నవేగామ్ గ్రామంలో భూ మాఫియా రెచ్చిపోతోంది. ఆసిఫాబాద్ మండలానికి చెందిన శ్రీనివాస్, చరణ్ దాస్, మనోజ్ అనే ముగ్గురు వ్యక్తులు గ్రామంలోని 100కు పైగా కుటుంబాలను బెదిరిస్తున్నారు. తాము నివసిస్తున్న భూమి తమదేనని, తమ పేరున పట్టా ఉందని వాదిస్తూ ఇళ్లను ఖాళీ చేయాలని రెండేళ్లుగా ఒత్తిడి చేస్తున్నారు. బాధితులు తమ పూర్వీకులు 200 సంవత్సరాలుగా ఈ స్థలంలో నివసిస్తున్నారని, పన్నులు చెల్లిస్తున్నారని చెబుతూ ఆర్‌డీఓకు ఫిర్యాదు చేశారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.