Chandrababu on Thalliki vandanam: ఏపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ జనసేన ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టోలో వీటిని ప్రకటించారు. అయితే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని వైసీపీ పదే పదే విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సూపర్ సిక్స్ హామీల అమలుపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఈ పథకాలను ఎప్పుడు అమలు చేస్తామనే దానిపై ఆర్థికశాఖ అధికారులతో జరిగిన సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. వార్షిక బడ్జెట్ నేపథ్యంలో ఆర్థిక మంత్రి పయ్యావుల, ఇతర అధికారులతో భేటీ అయిన చంద్రబాబు.. సూపర్ సిక్స్ పథకాల అమలుపైనా చర్చించినట్లు సమాచారం.