దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించే వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలోని బిల్డర్లు , పారిశ్రామికవేత్తలు విసుగు చెందుతున్నారని అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ప్రభాకర్ రెడ్డి ప్రసంగించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాల పట్ల విసుగు చెందిన పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు అవసరమైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని.. ఆ ఖర్చులను తామే భరిస్తామంటున్నట్లు తెలిపారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.