YSRCP MLC Ananta Babu: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ‘బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ’ అని రాశారు. ఈ ఫోటోలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులతో కలిసి అనంతబాబు ఫోటో దిగినట్లుగా కనిపిస్తున్నారు. వైసీపీ నేత, అందులోనూ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. కూటమి ప్రభుత్వ నేతలతో ఫోటో దిగడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ ఫోటో వెనుక నేపథ్యం ఏంటి? వివరాలు..