తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలవటమేమో కానీ.. ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు కళకళలాడిపోతున్నాయి. కాదు కాదు.. కిక్కిరిసిపోతున్నాయి. పరిమితికి మించి జనాలు ఎక్కేస్తున్నారు. దీంతో.. ఎక్సలరేటర్ తొక్కలేక డ్రైవర్, టికెట్లు కొట్టలేక కండక్టర్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలోనే.. ఓ డ్రైవర్ చేతులెత్తేశాడు. ఈ బస్సు నడపటం నావల్ల కాదు బాబోయ్ అంటూ.. నడిరోడ్డు మీదే బస్సు ఆపేసి.. దిగిపోయాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగింది.