ఏపీ రాష్ట్రానికి చెందిన క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ నగరంలో తిరగనివ్వాలన్న డిప్యూటీ సీఎం పవన్ తీరుపై తెలంగాణ క్యాబ్ అసోసియేషన్స్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోటర్ వాహన చట్టం ప్రకారం ఇతర రాష్ట్రాల వాహనాలు అనుమతి లేకుండా పక్క రాష్ట్రాల్లో తిరగకూడదనే విషయం పవన్‌కు తెలియదా అని ప్రశ్నించారు.