AP Govt MoU For Resort In S Kota: ఉత్తరాంధ్రకు మరో పర్యాటక ప్రాజెక్ట్ వచ్చింది. విజయనగరం జిల్లా ఎస్.కోటలో రూ.200 కోట్లతో హిలోరా రిసార్ట్ ఏర్పాటు చేయనున్నారు. 60 ఎకరాల్లో హిలోరా ఎకో రిసార్ట్స్, ది ఓజోన్ కలెక్షన్, కలర్స్ ఆఫ్ ఓ బ్లూ కలిసి ఈ రిసార్ట్ నిర్మించనున్నారు. ఈ మేరకు విశాఖపట్నంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. హిలోరా రిసార్ట్ ఉత్తరాంధ్ర పర్యాటక ప్రాజెక్టుల్లో కీలకంగా మారుతుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.