హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ 15వ ఫేజ్‌లో హౌసింగ్ బోర్డు నిర్వహించిన ప్లాట్ల వేలంలో గజం గరిష్ఠంగా రూ.2.14 లక్షలు పలికింది. మొత్తం 24 స్థలాలకు వేలం నిర్వహించగా 12 ప్లాట్లకే పోటీ వచ్చింది. హెచ్‌ఐజీ కేటగిరీలోని నాలుగు ప్లాట్లలో రెండు అమ్ముడయ్యాయి. 266.66 గజాల ప్లాట్ నంబర్ 105 అత్యధిక ధర పలికింది. 12 స్థలాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.39.30 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. తక్కువ పోటీ ఉన్నప్పటికీ కీలక ప్రాంతంలోని భూములకు కళ్లుచెదిరే ధరలు రావడం గమనార్హం.