Sri Sathya Sai District Pond Boy Died: శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రసాద్, అంజలి దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టిన ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. వారి ఎనిమిదేళ్ల కుమారుడు దిలీప్ ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించాడు. ఆ తల్లి బిడ్డను చూసుకునే సంతోషంలో ఉండగా, పెద్ద కుమారుడు దూరమయ్యాడనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇది స్థానికంగా విషాదఛాయలు నింపింది.