హైదరాబాద్ నార్సింగ్‌లో తొలిరోజు ఉద్యోగానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న ఇంజనీర్ నవీన్ చారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అతడి తలకి బలమైన గాయమైంది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు నవీన్‌ను నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.