కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కరెన్సీ నోట్లపై నుంచి మహాత్మా గాంధీ చిత్రాన్ని తొలగించేందుకు మోదీ, అమిత్ షా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ, నెహ్రూల త్యాగాలను కనుమరుగు చేయాలని కేంద్రం చూస్తోందని మండిపడ్డారు. నెహ్రూ దేశం కోసం 12 ఏళ్లు జైలుకు వెళ్లారని.. కానీ స్వాతంత్ర్యం వచ్చినప్పుడు పుట్టని వారు నేడు ఆయనను విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.