నేరానికి కాదేది అనర్హం అన్న రీతిలో కేటుగాళ్లు తయారయ్యారు. పాత సెల్‌ఫోన్ల సాయంతో.. కొత్త మోసాలకు తెరలేపారు సైబర్ నేరగాళ్లు. పాత ఇనుప సామాన్లు, స్టీల్ సామాన్ల ముసుగులో పాత సెల్ ఫోన్లను ప్రజల వద్ద కొనుగోళ్లు చేసి.. వాటిని బిహారీలకు అమ్మేస్తున్నారు. వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఐదుగురు అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్లను కూడా అరెస్టు చేశారు. అంతే కాదు.. పెద్ద ఎత్తున సెల్‌ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.