మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ లో డ్రగ్స్ తయారీ యూనిట్‌ను మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో 32,000 లీటర్ల ముడిసరకును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. మిథైలెనెడియాక్సీ మెథాంఫెటమైన్ ముడి పదార్థాలు, మోలీ, ఎక్స్‌టీసీ వంటి డ్రగ్స్ దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. స్థానిక పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టనున్నారు. అరెస్టు చేసిన నిందితులను ముంబయికి తరలించనున్నారు.