సిద్దిపేట జిల్లాలోని సముద్రాల, బస్వాపూర్ గ్రామాల్లోని జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్‌ను జిల్లా కలెక్టర్ హైమవతితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దాదాపు రెండేళ్ల నుంచి రాత్రి వేళల్లో వెలుతురు లేక ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు పడుతున్న ఇబ్బందులు ఈ లైటింగ్ ప్రారంభంతో తీరిపోయాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.