తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతిని అరికట్టేందుకు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ఇకపై ఇండ్లు, ఖాళీ స్థలాలకు కూడా వ్యవసాయ భూముల మాదిరిగా పక్కాగా ‘యాజమాన్య హక్కు పత్రం’ (టైటిల్) ఇవ్వాలని యోచిస్తోంది. ఈ వ్యవస్థలో 'బ్లాక్ చైన్ టెక్నాలజీ'ని ప్రవేశపెట్టడం ద్వారా డబుల్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల కబ్జాలను నివారించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే.. సర్వే నంబర్ బ్లాక్ విధానం ద్వారా లేఅవుట్ మోసాలను అడ్డుకోవాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.