ఎన్ని సార్లు చెప్పినా మీరు మారరా ?.. సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం, హైకోర్టు సీరియస్

8 months ago 17
శాంతిభద్రతల పరిరక్షణ కంటే సివిల్ వివాదాల్లోనే పోలీసులు అధిక ఆసక్తి చూపిస్తున్నారని తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని బార్కాస్ ప్రాంతానికి చెందిన మొహిసిన్ బఫానా అనే వ్యక్తి తన ఇంటి స్థలంపై సివిల్ కోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని పోలీసులు బెదిరించారని హైకోర్టును ఆశ్రయించగా.. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడింది. పోలీసులు ప్రజల్లో విశ్వాసం నింపడంలో విఫలమవుతున్నారని, తమ పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Read Entire Article