ఏపీ మంత్రి నారా లోకేష్ పరువు నష్టం కేసులో విశాఖపట్నంలో కోర్టుకు హాజరయ్యారు. అనంతరం కోర్టు ఆవరణలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ తప్పు చేయకుండా ఆరోపణలు చేశారని.. అందుకే తాను పరువు నష్టం దావాను దాఖలు చేసినట్లు తెలిపారు. ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాని.. ఎప్పటికైనా నిజం గెలుస్తుందన్నారు. ఈ కేసులో ఎన్నిసార్లైనా కోర్టుకు వస్తానని.. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు. విశాఖపట్నం పర్యటనకు తన సొంత డబ్బులు ఖర్చు చేసి వచ్చానని.. బస్సులో పడుకున్నట్లు చెప్పారు. తన కారుకు డీజిల్ కూడా సొంత డబ్బులతో కొట్టించానని.. చిన్న తనంలో తన తల్లి భువనేశ్వరి ప్రభుత్వంపై ఆధారపకూడదని చెప్పారని.. అందుకే తాను సొంత డబ్బుల్ని ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.