Koneti Adimulam High Court Quashed: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనపై కేసును హైకోర్టు కొట్టేసింది. ఆయనపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళ స్వయంగా కోర్టుకు హాజరై.. ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవమని తెలియజేశారు. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేశారు.. కోర్టు నేటికి విచారణను వాయిదా వేసింది.. ఇవాళ కేసును క్వాష్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.