తరుచూ వివాదాలు, సంచలన ప్రకటనలతో వార్తలో నిలుస్తారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. అయితే, బీజేపీకి చెందిన ఈ ఎమ్మెల్యే, ఆయన కుటుంబం, బంధువులకు చెందిన పలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను మెటా సంస్థ తొలగించింది. అయితే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఫిర్యాదు వల్లే తన ఖాతాలను బ్లాక్ చేశారని ఆరోపించిన ఆయన.. హిందువులను లక్ష్యంగా చేసుకుని సెలెక్టివ్ సెన్సార్‌షిప్ దాడి చేస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు రాజాసింగ్.