ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో కొన్ని జిల్లాలలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ పిలుపునిచ్చిన ఫీజు పోరు కార్యక్రమం వాయిదా పడింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ ఫిబ్రవరి 5న ఫీజు పోరుకు వైసీపీ పిలుపునిచ్చింది. అయితే పలు జిల్లాలలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ మేరకు వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి ఐదున జరగాల్సిన ఫీజు పోరు కార్యక్రమాన్ని మార్చి 12న చేపట్టనున్నట్లు తెలిపింది.