MLC Election Results: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఇటీవలే (ఫిబ్రవరి 27న) ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఎన్నికలకు మార్చి 3వ తేదీన లెక్కింపు ప్రక్రియ జరగనుంది. అయితే.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ విధానం ఎంత భిన్నంగా ఉంటుందే.. కౌంటింగ్ ప్రక్రియ కూడా అలాగే కాస్త వేరేగా ఉంటుంది. ఈ లెక్కింపు ప్రక్రియలో ప్రాధాన్యత ఓట్లకు ఎలాంటి ప్రియారిటీ ఉంటుంది.. ఇందులో ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందన్నది కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. మరీ ఈ మొత్తం కౌంటింగ్ ప్రాసెస్ గురించి ఓ లుక్కేసుకోండి.