ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించిన అధికారులు

1 year ago 42
ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ బస్ భవన్ వద్ద జాగృతి కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బస్ భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపగా, పోలీసులు కవితను, కార్యకర్తలను అరెస్ట్ చేసి చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపుతోందని విమర్శించారు.
Read Entire Article